MHBD: గూడూరు మండలం బొద్దుగుండ గ్రామంలో వడదెబ్బతో పుల్సం ఎల్లమ్మ (48) అనే మహిళా కూలీ మృతి చెందింది. బుధవారం ఉదయం మిరప తోటలో పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.