NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం స్టోన్ హోస్ పేట సి.ఆర్.పి డొంక ప్రాంతంలో నూతనంగా నిర్మాణం అవుతున్న సులబ్ కాంప్లెక్స్ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. నిర్మాణ విస్తీర్ణత, డ్రైనుకాలవల అనుసంధానం పనులను పరిశీలించిన ఆయన, డ్రైను కాలువల నిర్వహణ తీరు, ప్రజల అవగాహనపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.