NLG: TG RTC జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన RTC కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని CPI జిల్లా కార్యదర్శి, MLC నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మెకు మద్దతు తెలుపుతూ కార్మికులను ఉద్దేశించి నెల్లికంటి సత్యం మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం RTC కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.