కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లికీ చెందిన విద్యార్థి శ్రీహర్షిత్ ఇంటర్ ఫస్టియర్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. దీంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆ విద్యార్థిని సన్మానించారు. ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్న శ్రీహర్షిత్ రైతు కుటుంబ నేపథ్యం నుంచి ర్యాంక్ సాధించడం అభినందనీయం అన్నారు. ఉన్నత లక్ష్యంతో చదవాలని సూచించారు.