PPM: వేసవిలో ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎన్సీడీ అధికారి డా. టి. జగన్ మోహన్ సూచించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రయాణీకులు, డ్రైవర్లు, సిబ్బందికి సూచనలు అందించారు. తగినంత త్రాగునీరు, ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లడం, లేత కాటన్ దుస్తులు ధరించడం అవసరమన్నారు.