VSP: ఈ నెల 27న జరిగే ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీఐపీ ఏర్పాట్లు, వేదిక, పార్కింగ్, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రముఖుల వీవీఐపీ ప్రోటోకాల్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.