NRPT: జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ శెట్టి మహేశ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధుల జాప్యం వల్ల పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల సాకుతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల పైచదువులకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు.