NRPT: ఊట్కూరు మండలం పులిమామిడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సర్పంచ్ త్రివేణి చలివేంద్రాన్ని ప్రారంభించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా బాటసారులు, కూలీల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.