MDK: రామాయంపేట మండల పరిధిలోని సుతారిపల్లి గ్రామంలో సంజీవని హాస్పిటల్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సర్పంచ్ మద్దురి సునీల్, వార్డు సభ్యుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ సూచించారు.