ASF: జైనూర్ మండల కేంద్రంలో వసుధ ఫౌండేషన్ సహకారంతో గిరిజన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రారంభించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వాలంబన సాధించాలని కోరారు. ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.