NRPT: ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం AIPKMS నేతలు నారాయణపేట తహశీల్దార్ అమరేంద్ర కృష్ణకు వినతి పత్రం అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి హాజీ మలంగ్ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, కూలీలకు 200 పని దినాలు కల్పించాలని కోరారు. రోజుకు కూలి రూ.600 ఇవ్వాలని కోరారు.