ASF: డివైన్ గ్రూప్ పేరుతో నకిలీ పెట్టుబడులు నిర్వహించి, 20% వరకు అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి సుమారు రూ.2 కోట్లు వసూలు చేసిన కేసును ఆసిఫాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితురాలు థాకూర్ శివరంజనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలు ఇటువంటి మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు.