HYD: బండ్లగూడ పోలీసుల చాకచక్యంతో ద్విచక్ర వాహన దొంగతనం కేసు ఛేదించారు. మహమ్మద్ నగర్లో బజాజ్ పల్సర్, RS-200 దొంగిలించిన కేసులో, తనిఖీల్లో ఇద్దరిని పట్టుకొని విచారణ జరపగా మొత్తం 5 మంది బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు మత్తు అలవాట్ల కోసం చోరీలకు పాల్పడినట్టు తేలింది. మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.