BPT: బల్లికురవ మండలంలోని మల్లాయపాలెం గ్రామంలో రైతులకు భూసార రక్షణ, ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడటం వల్ల భూమి నిస్సారమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.