ADB: ఇచ్చోడా మండలంలోని సిరిచేల్మా గ్రామంలో వెలిసిన పురాతన మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, ఆలయ విశిష్టత గురించి ఆయనకు వివరించారు. వీరితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.