NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆరో వార్డు కౌన్సిలర్ గంగూలీ గౌడ్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.