MNCL: తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాల ఆర్టీసీ డిపోను సందర్శించి సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పీఆర్సీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.