MBNR: ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరడంతో కార్గో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సేవలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ కొరియర్, కార్గో సంస్థలు ఛార్జీలను భారీగా పెంచి సామాన్యులను దోచుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది.