NLG: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి పంచాయతీ సిబ్బందిని యువజన నాయకుడు, ఆ గ్రామ వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ శుక్రవారం శాలువాలు కప్పి గౌరవించారు. గ్రామ అభివృద్ధికి, పరిశుభ్రతకు వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని హరికృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరమేష్, ఉపసర్పంచ్ భవాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.