HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సంచాలకులు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తారు.