TG: పోడు రైతులపై అటవీ అధికారుల దాడులను వెంటనే ఆపాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు పట్టాలివ్వాలని, అందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.