AP: రాష్ట్రంలో మలేరియా జ్వరాల నివారణకు ప్రభుత్వం ఉచితంగా దోమతెరలు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 7.8 లక్షల మంది విద్యార్థులకు వీటిని అందజేయనుంది. 3402 వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు పంపిణీ ముమ్మరం చేశారు. పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో ఇప్పటికే పంపిణీ పూర్తి చేశారు. మరో మూడు నెలల్లో మిగిలిన జిల్లాల్లోనూ దోమతెరల పంపిణీ పూర్తి చేయనున్నారు.