VSP: పీఎంపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి నివసిస్తున్న వ్యక్తి బాలికపై పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను వైద్య పరీక్షలకు తీసుకెళ్లగా ఘటన బయటపడింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.