BHPL: పలిమెల మండలం సర్వాయిపేట గ్రామంలో గుడుంబా అక్రమ తయారీపై ఎస్సై రమేశ్ సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి ఉపయోగించిన 350 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.