TG EAPCET-2026 హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. అలాగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు హాల్ టికెట్లు ఏప్రిల్ 27న విడుదల కానుండగా, పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.