ఎవరైనా గిలిగింతలు పెట్టినప్పుడు నవ్వడం సరదా కాదు, అది మన మెదడు తీసుకునే రక్షణ చర్య. మెడ, అరికాళ్లు వంటి సున్నిత భాగాలను తాకినప్పుడు మెదడు దానిని ఒక దాడిలా భావించి, శరీరాన్ని అప్రమత్తం చేయడానికి ‘నవ్వు’ రూపంలో అలారం మోగిస్తుంది. అయితే, మనకు మనమే కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదు. ఆ స్పర్శ గురించి బ్రెయిన్‌కు ముందే తెలియడమే దీనికి కారణం.