TPT: అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రైతులు గిట్టుబాటు ధర కోరుతున్నారు. పూత, పిందె దశల్లో కాయలు రాలిపోవడంతో దిగుబడి తగ్గిందన్నారు. ఈ పరిస్థితుల్లో KG మామిడికి రూ.8-10 వరకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సహాయం అందిస్తే నష్టాల నుంచి బయటపడగలమని చెబుతున్నారు.