MDK: చేగుంట మండలం కర్నాల్ పల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన తుమ్మ బాలయ్య ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సిబ్బందితో అక్కడికి వెళ్లి రామయంపేట ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.