ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో రెండో రోజు భారత్కు మూడు రజతాలు, ఒక కాంస్యం వరించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ పురుషుల ఈవెంట్లో రోహిత్ కన్యన్ భారత్కు తొలి రజతం అందించాడు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సెజల్ కాంబ్లే రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాజ్చంద్ర, అభినవ్ దేశ్వాల్ రజతం, కాంస్యం సాధించారు.