AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. 95 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 101 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని హెచ్చరించారు.