AP: అమరావతిలోని రాంబిల్లిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెన్యువబుల్ సంస్థ శంకుస్థాపనలో ఆయన పాల్గొననున్నారు. రూ.5,400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుండటంతో 2,100 మందికి ఉపాధి దక్కనుంది. కాగా గత ఏడాది విశాఖ వేదికగా జరిగిన CII సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూ సంస్థ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.