కడపలో APSRTC జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు బుధవారం ఉన్నతాధికారులతో స్త్రీ శక్తి, దివ్యాంగశక్తి పథకాల అమలుపై సమీక్షించారు. అనంతరం పాత బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులపై ఆరా తీశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కడప-మైదుకూరు వెళ్లే బస్సులో ప్రయాణించి, పథకాల అమలు, సిబ్బంది పనితీరుపై ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.