HYD: మాదక ద్రవ్యాల వ్యసనం నేర సమస్య మాత్రమే కాదు, అది ఆరోగ్య, సామాజిక సమస్య కూడా అని టీజీ ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. చంచల్గూడ జైలు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జైలు అధికారులతో ఆయన మాట్లాడారు. వ్యసనం, ఆధారపడటం, సహనం వంటి అంశాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనానికి గురైన వారిని కఠినంగా కాకుండా మానవత్వంతో చూడాలన్నారు.