కోనసీమ: రామచంద్రపురం (M) కాపవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై కూటమి పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ప్రేరేపిస్తూ, కులాల మధ్య విద్వేషాలు రేపి కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం బుధవారం డిమాండ్ చేశారు. కూటమి పార్టీ నాయకులపై దాడి చేయటo తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.