ఐపీఎల్లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో, రాజస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. IPL చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. రాజస్థాన్ 4, లక్నో 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న లక్నోలోని ఏకనా స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా, అందులో కూడా రాజస్థానే గెలిచింది. కాగా, ఈ స్టేడియంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 173 పరుగులుగా ఉంది.