NLG: ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక వివక్ష వల్ల వచ్చిన రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మతం మారినా దళితులపై వివక్ష తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.