ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కేబీకే నాయక్, అధ్యాపకులు కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారానే నేలతల్లి రుణం తీర్చుకోగలమని ఆయన పేర్కొన్నారు.