అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం 2026 జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల చిత్ర ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులు సూచించడంతో, చిత్ర బృందం క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ సహా కొన్ని కీలక దృశ్యాలను రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. అఖిల్, ఇతర తారాగణం ఈ షూట్లో పాల్గొంటున్నారట. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.