KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7,800 పలుకగా.. మంగళవారం రూ.100 పెరిగి రూ. 7,900 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్కు రైతులు 2 వాహనాల్లో 13 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు.