ప్రకాశం: కందుకూరు డివిజన్ పరిధిలోని వలేటివారిపాలెం మండలం ఎస్సీ కాలనీలో మంగళవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి వివరాలు సేకరించారు. మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.