MDCL: జిల్లాలో DEO కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి పలు లోపాలను గుర్తించారు. ప్రైవేట్ పాఠశాలలు ఆడిట్ నివేదికలు సమర్పించక పోవడం, ఫీజులపై పర్యవేక్షణ లేకపోవడం, పీరియాడిక్ తనిఖీలు, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం గుర్తించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.