KDP: పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పర్యవేక్షణలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లెలోని గవి మల్లేశ్వరస్వామి గుడి క్రాస్ రోడ్డులో దాడులు నిర్వహించామన్నారు. వేంపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవించి, గంజాయి విక్రయిస్తుండగా వారి వద్ద నుంచి 1100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.