MNCL: మహిళా రిజర్వేషన్లలో SC, ST, BC మహిళలకు ఉప కోటా కేటాయించాలని దళిత కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి CPI కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పోచన్న మాట్లాడుతూ.. 33% రిజర్వేషన్ బిల్లు సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. అణగారిన వర్గాల మహిళలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించినప్పుడే అసలైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.