NRPT: నారాయణపేట నియోజకవర్గంలోని 889 మంది నేత కార్మికులకు రూ. 26.91 లక్షల విలువైన ‘నేతన్న భరోసా’ చెక్కులను మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేత అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.