MBNR: భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.