MHBD జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మంగ వెంకట్ రాములు (70) బుధవారం తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు.. ఆ చెట్టు పై నుంచి పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలై అక్కడికిక్కడే మరణించినట్లు తోటి గీత కార్మికులు తెలిపారు. రాములుకు భార్య, కూతురు ఉన్నారు. ప్రభుత్వం రాములు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.