జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు దేవరకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.