AKP: రాంబిల్లి మండలం జెడ్. చింతువ గ్రామంలో రెన్యూ 3డీ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అక్కడ వారికి రెన్యూ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రతినిధులు 3డీ మోడల్ గురించి వివరించారు. అనంతరం బృందంతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు. దీనికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా పలువురికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.