AP: కొన్ని దేశాల సామ్రాజ్య వాదన ధోరణి వల్లే యుద్ధాలు జరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లు ఇవాళ కాకపోయినా రేపైనా అమలులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.