AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల D.EL.Ed కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘డీఈఈసెట్-2026’ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గడువులోపు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.